మహారాష్ట్ర(Maharashtra)లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది. ముంబయి-గోవా హైవే మార్గంలోని రత్నగిరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లైఓవర్(Flyover)కు పగుళ్లు రావడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డుపై పాదాచారులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాహనదారులు (Motorists) ఎవరి దారిలో వారు వెళ్తున్నారు.. అయితే అకస్మాత్తుగా అలజడి నెలకొంది. ఒక్కసారిగా నిర్మాణంలో ఫ్లైఓవర్ కుప్పకూలింది. పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలింది.
దీంతో అక్కడున్న వారందరూ ఉలిక్కి పడ్డారు. పాదాచారులు (Pedestrians) భయంతో పరుగులు తీశారు.అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు.బ్రిడ్జి(Bridge)కి ఓ చోట పగుళ్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాన్ని బారికేడ్ల(Barricades)తో మూసివేసిన అధికారులు.. అటువైపు ఎవరూ వెళ్లకుండా పోలీసు (Police) సిబ్బందిని మోహరించారు.ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రిడ్జి కుప్పకూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
#WATCH | Maharashtra | A pillar at the under-construction site of Mumbai-Goa four-lane highway collapsed today morning in Chiplun. Soon after, a portion of the flyover also collapsed, damaging a crane machine that was being used at the site. No injuries or casualties were… pic.twitter.com/m5iVsXCPhi