Man poses as JP Nadda's personal assistant, demands money from BJP MLAs for cabinet berths
JP Nadda PA:బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పీఏ అంటూ నీరజ్ సింగ్ రాథొడ్ అనే వ్యక్తి మోసం చేసేందుకు ప్రయత్నించాడు. నీరజ్ సింగ్ రాథొడ్ది (Neeraj singh) గుజరాత్ మోర్బి కాగా.. మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలతో (mla) సంప్రదింపులు జరిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో మంత్రి పదవీ ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు.
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు (bjp mla) వికాస్ కుమ్బారే (vikas), తెక్చంద్ సావర్కర్, తానాజీ ముత్కులే, నారాయణ్ కుచెతో మాట్లాడారు. తాను జేపీ నడ్డా (JP Nadda) పీఏ అని.. మంత్రి పదవులు ఇప్పిస్తానని.. రూ.లక్షల్లో నగదు ఇవ్వాలని అడిగాడు. ఎమ్మెల్యేలను (mla) నమ్మించేందుకు నడ్డా వాయిస్ ఉన్న మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడించాడు.
నీరజ్ సింగ్ (neeraj singh) ఒకసారి చెబితే అయిపోయేది.. కానీ మంత్రి పదవీ కోసం వికాస్‌ను వేధించాడు. పట్టణాభివృధ్ది శాఖ మంత్రి పదవీ ఇప్పిస్తానని చెప్పాడు. అనుమానం వచ్చి వికాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే పీఏ (mla pa) తమకు ఫిర్యాదు ఇచ్చారని.. గుజరాత్లో జరిగే ఈవెంట్ కోసం వికాస్ నగదు అడిగారని పోలీసులు ధృవీకరించారు. వికాస్‌పై నాగ్ పూర్లో గల కొత్వాలి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు కేసు నమోదు చేశారు.