MLC Kodandaram: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రో. కోదండరామ్
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీగా నియమిస్తూ తెలంగాణ గవర్నర్ తమిళసౌ సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేసింది. కోదండరామ్‌తో పాటు మీర్ అమీర్ అలీఖాన్‌ను కూడా నియమించింది.
MLC Kodandaram: తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్‌ల ఎంపికకు ఆమోదం తెలిపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరామ్‌ను ప్రతిపాదించారు. అలాగే సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీఖాన్‌ను కూడా ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించారు. తాజాగా వీరిద్దనిని ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదం తెలిపారు.