Mahender Reddy: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ అమోదించారు. ఈయనకు ముందు టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా జనార్థన్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జనర్థన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గత ప్రభుత్వం హయంలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో త్వరలోనే ఉద్యోగనోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు ఆశతో ఉన్నారు.