telangana assembly elections 2023 this polling precautions must
Mahabubnagar : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఎన్నికలు జరిగాయి. అయితే ఏప్రిల్ 2న జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ను వాయిదా వేయాలని ఎన్నికల కమిషనర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా కౌంటింగ్‌ను నిలిపివేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని ఈసీ ఆదేశించింది. జూన్ 2న మరోసారి ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని ఈసీ సూచించింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు.