»Amit Shah Will Have A Crucial Meeting With Telangana Bjp Leaders Tomorrow
Amit Shah : రేపు తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా కీలక భేటీ..
ఎలగైన తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ (BJP)సన్నాహాలను ప్రారంభించింది. ఇప్పటికే.. మిషన్ 90తో వ్యూహాలను రచించిన బీజేపీ ...నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలోతెలంగాణ ముఖ్యనేతలకు ఢిల్లీ బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. రేపు మధ్యాహ్నం 12గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah).. రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం అవుతారు.
ఎలగైన తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ (BJP) సన్నాహాలను ప్రారంభించింది. ఇప్పటికే.. మిషన్ 90తో వ్యూహాలను రచించిన బీజేపీ …నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలోతెలంగాణ ముఖ్యనేతలకు ఢిల్లీ బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. రేపు మధ్యాహ్నం 12గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah).. రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం అవుతారు. బండి సంజయ్, (Banadi sanjay) కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల, వివేక్, జితేందర్ రెడ్డి తో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మిషన్ (90 Mission) 90 తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల ప్రణాళిక పై చర్చ జరగనున్నట్లు పేర్కొంటున్నారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సహా కీలక నేతలంతా కూడా ఢిల్లీ(Delhi) పయనం అయ్యారు.
మిషన్ 90 పేరుతో ఇప్పటికే తెలంగాణలో ఆపరేషన్ చేపట్టింది పార్టీ. ఇందుకోసం 10 నెలలకు కావాల్సిన రోడ్‌మ్యాప్ (Road map) ఇచ్చింది. ఇందులో భాగంగా యాక్షన్ ప్లాన్ అమలు తీరుతో పాటు.. నాయకత్వానికి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ విస్తరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇంకా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం.. పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయాన్ని సైతం తెలుసుకున్నారు. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Sisodia) అరెస్ట్, ఈ కేసులో సౌత్ గ్రూప్ పాత్ర ఉందని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్న నేపథ్యంలో.. బీజేపీ మినీ కోర్ కమిటీ (Core Committee) సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, (Kishan Reddy) ,బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరుకానున్నారు.