»Two More Earthquakes In Gujarat Fifth Incident In A Week
Earthquake: గుజరాత్లో మరో రెండు భూకంపాలు..వారంలో ఐదోసారి ఘటన
గుజరాత్లో వరుస భూకంపాలు(Earthquake) భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం రాజ్ కోట్ వద్ద భూకంపం(Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం మరో రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. వరుసగా రెండు సార్లు భూ ప్రకంపనలు(Earthquake) జరగడంతో ప్రజలు భయాందోళన చెందారు.

గుజరాత్లోని కచ్(Kutch), అమ్రేలి(Amreli) ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూకంపాలు(Earthquake) సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపాల(Earthquake) తీవ్రత రిక్టరు స్కేలు(Richter Scale)పై 3.8, 3.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కచ్(Kutch) జిల్లాలో సోమవారం ఉదయం 10.49 గంటల ప్రాంతంలో3.8 తీవ్రతతో భూ కంపం సంభవించింది. లఖ్ పట్ టౌన్ కు 62 కిలోమీటర్ల దూరంలో 15 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.
అదేవిధంగా సోమవారం తెల్లవారుజామున 1.42 గంటలకు అమ్రేలి(Amreli) ప్రాంతంలో భూ ప్రకంపనలు(Earthquake) జరిగాయి. మిటియాల గ్రామం వద్ద 7.1 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఈ భూకంపాల(Earthquake) ధాటికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు.
వరుస భూకంపాల(Earthquake)తో గుజరాత్ రాష్ట్రం భయాందోళన చెందుతోంది. అమ్రేలి(Amreli) ప్రాంతంలో గత వారం రోజుల్లోనే 3.1, 3.4 తీవ్రతతో రెండు భూకంపాలు(Earthquake) సంభవించాయి. ఇలా జరగడం ఐదోసారి అని అధికారులు వెల్లడించారు. సోమవారం సంభవించిన భూకంపాల(Earthquake) వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.