GNTR: తెనాలి బోసురోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించి, వినతి పత్రాలను అందజేశారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.