ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇవాళ 2కే రన్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ప్రారంభమై రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు కొనసాగనుంది. కార్యక్రమానికి పట్టణ ప్రజలు, యువత అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.