»Khushboo Sundar Nominated As Member Of National Commission For Women
khushboo: మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ
భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ను కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు మమతా కుమారి, డెలినా కోంగ్డప్ లను కూడా నియమించారు. వీరు ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.
Khushbu Sundar Nominated As Member Of National Commission for Women
భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ను కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు మమతా కుమారి, డెలినా కోంగ్డప్ లను కూడా నియమించారు. వీరు ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. తనకు పదవి రావడంపై ఖుష్బూ స్పందించారు. ఇంత పెద్ద బాధ్యతను తనకు అప్పగించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
నారీ శక్తిని పరిరక్షించడానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసారు. ఖుష్బూను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడంపై పలువురు కంగ్రాట్స్ చెబుతున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు బీజేపీ తరఫున ఆయన కంగ్రాట్స్ చెప్పారు. తనకు కంగ్రాట్స్ చెప్పిన వారికి ఆమె థ్యాంక్స్ చెప్పారు.