»Anurag Thakur Meets Chiranjeevi Nagarjuna In Hyderabad
BJP leader meet Chiranjeevi: చిరంజీవి ఇంటికెళ్లిన బీజేపీ మంత్రి, అక్కడే నాగార్జున
కేంద్రమంత్రి (Union Minister), బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) ఆదివారం కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని, టాలీవుడ్ సూపర్ స్టార్ (Nagarjuna)ను కలిశారు. హైదరాబాద్ (Hyderabad) లోని మెగాస్టార్ ఇంటికి వెళ్లి కాసేపు ముచ్చటించారు.
కేంద్రమంత్రి (Union Minister), బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) ఆదివారం కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని, టాలీవుడ్ సూపర్ స్టార్ (Nagarjuna)ను కలిశారు. హైదరాబాద్ (Hyderabad) లోని మెగాస్టార్ ఇంటికి వెళ్లి కాసేపు ముచ్చటించారు. సినిమా పరిశ్రమకు (Cine Industry) సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి ట్విట్టర్ లో (Twitter) షేర్ చేశారు. ‘హైదరాబాద్ కు (Hyderabad) వచ్చినప్పుడు మీరు ఇలా మా ఇంటికి వచ్చి కలవడం ఆనందంగా ఉంది’ అని చిరంజీవి పేర్కొన్నారు. తాము భారత చిత్ర పరిశ్రమ (Indian Cinema) గురించి మాట్లాడుకున్నామని చెప్పారు. ఈ సమయంలో తన సోదరుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కూడా ఉన్నారని పేర్కొన్నారు. తెలుగు పరిశ్రమలో చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన రాజకీయాల్లో నిలబడలేక పోవచ్చు. కానీ సినిమాలో ఆయన నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా నాయకుడిగా విఫలమైనప్పటికీ.. తెలుగు పరిశ్రమలో ఆయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రతి పార్టీ ఆయనను మచ్చిక చేసుకోవాలని చూస్తుంటుంది. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ ను (Pawan Kalyan) విమర్శించే సమయంలోనూ ఏపీలో అధికార వైసీపీ… చిరంజీవి పట్ల సాఫ్టుగా మాట్లాడింది. నిన్న తనను అనురాగ్ కలిశారని చిరంజీవి ఈ రోజు ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఓ కేంద్రమంత్రి చిరు నివాసానికి వచ్చి కలిశాడంటే… ఆయన తెలుగు సినిమా లెజెండ్ అండ్ టార్చ్ బేరర్ అంటూ ప్రశంసిస్తున్నారు అభిమానులు.
పదహారేళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, 2009లో బొక్క బోర్లా పడిన చిరంజీవి, ఆ తర్వాత రెండేళ్లకే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరం జరిగారు. చిరంజీవికి రాజకీయాలు సరిపోవు అని ఆయన అభిమానులతో పాటు చాలామంది నమ్ముతారు. అదే సమయంలో సినిమాల్లో మాత్రం ఆయన బాస్ అంటారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్రమంత్రిగా ఉన్నారు. 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు నుండే చిరంజీవి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం మానివేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పటికి అప్పుడు ఆయన తమ వాడే అని చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం తాను రాజకీయాలకు దూరమని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్… చిరంజీవి తమ పార్టీలో ఉన్నాడని పేర్కొనడం గమనార్హం. అంతెందుకు ప్రస్తుతం ఆయన తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు కూడా బాహాటంగా మద్దతు పలకడం లేదు. ఎన్నికల నాటికి ఏం జరుగుతుందనేది తర్వాత విషయం. చిరంజీవి ఎవరిని కలిసినా… ఆయనను ఎవరు కలిసినా రాజకీయంగా చర్చనీయాంశమవుతుంది. వాల్తేరు వీరయ్య సినిమాకు ముందు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
రాజకీయాలకు దూరం పాటిస్తున్న చిరంజీవి సినిమాల్లో మాత్రం బిజిగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేయడమే కాదు.. రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా రెండు వందల కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ము రేపింది. ప్రస్తుతం బోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ కూడా సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా.