KTR : నిందితుడు ఎవరైనా వదిలిపెట్టం… ప్రీతి ఘటనపై కేటీఆర్
KTR : మెడికో ప్రీతి మరణ వార్త తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీనియర్ వేధింపులు తాళలేక ప్రీతి బలవన్మరణానికి పాల్పడింది. దాదాపు ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో పోరాడి ఆమె ప్రాణాలు కోల్పోయింది.
మెడికో ప్రీతి మరణ వార్త తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీనియర్ వేధింపులు తాళలేక ప్రీతి బలవన్మరణానికి పాల్పడింది. దాదాపు ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో పోరాడి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన విషయంలో ఇప్పటి వరకు చాలా మంది స్పందించారు. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. కాగా.. తాజాగా ఈ విషయంపై ఆలస్యంగానైనా… మంత్రి కేటీఆర్ స్పందించారు.
మెడికో విద్యార్ధిని ప్రీతి ఘటనలో నిందితులను వదిలిపెట్టమని అన్నారు మంత్రి కేటీఆర్. స్టేషన్ ఘన్పూర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ప్రీతి ఘటనను కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని.. మండిపడ్డారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ హామినిచ్చారు. సైఫ్ అయినా సంజయ్ అయినా ఎవ్వరిని వదిలిపెట్టమని ఆయన హామీ ఇచ్చారు.