»Harsha Sai Released Another Video After A Long Gap
Youtuber Harsha Sai : చాలా గ్యాప్ తర్వాత మరో వీడియో రిలీజ్ చేసిన హర్ష సాయి
యూట్యూబర్ హర్ష సాయి(Youtuber Harsha Sai) గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. నెటిజన్లకు హర్షసాయి(Harsha Sai) అంటే దేవుడు. ఆయన తెలియనివారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో హర్షసాయి(Harsha Sai) చాలా యాక్టీవ్ గా ఉంటారు. పేదవాళ్లకు డబ్బులు సాయం చేస్తూ హర్ష సాయి ఫేమస్ అయ్యారు. ఎంతో మందికి తనవంతు సాయం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. హర్ష సాయి(Harsha Sai) యూట్యూబ్ లో వీడియో రిలీజ్ చేశాడంటే చాలు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చి పడతాయి.

యూట్యూబ్(Youtube)లో హర్షసాయి(Harsha Sai)కి 80 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రతిసారి ఏదొక సాయం ఆయన చేతుల మీదుగా జరుగుతూ ఉంటుంది. పేదల కన్నీళ్లను తుడిచే ప్రయత్నం హర్షసాయి(Harsha Sai) చేస్తూ ఉంటారు. మరి అటువంటి హర్షసాయి గత ఆరు నెలలుగా ఏ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేయడం లేదు. చివరగా గత ఏడాది అక్టోబర్లో హర్షసాయి ఓ వీడియోను అప్ లోడ్ చేయగా ఆ తర్వా ఏ వీడియోను ఆయన అప్లోడ్ చేయలేదు. దీంతో హర్షసాయి(Harsha Sai)కి ఏమైందని అందరూ అనుమానం వ్యక్తం చేశారు.
తాజాగా హర్షసాయి(Harsha Sai) ఓ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తన వీడియోల కోసం ఎదురుచూస్తున్న వారి అనుమానాలకు తెరదించుతూ కొత్త వీడియోను అప్లోడ్(New Video upload) చేశాడు. మరోసారి ఓ పేద కుటుంబానికి సాయం చేసిన వీడియోను హర్షసాయి(Harsha Sai) అప్లోడ్ చేశాడు. ఈసారి పాలు అమ్ముకునే వ్యక్తిని హర్షసాయి లక్షాధికారిని చేశాడు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లాడి ట్రీట్ మెంట్ కు అవసరమైన ఖర్చును కూడా తానే భరించాడు. ఆ కుటుంబం పాల వ్యాపారం చేసుకోవడానికి వీలుగా గేదెలు, షెడ్ ను ఏర్పాటు చేశాడు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు హర్షసాయి(Harsha Sai)కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.