తెలంగాణ (Telangana) పీజీఎల్ సెట్ (PGLCET) షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చి 1న లాసెట్ ,పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి( Limbadri) తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవిందర్, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మీతో కలిసి ఆయన విడుదల చేశారు.
తెలంగాణ (Telangana) పీజీఎల్ సెట్ (PGLCET) షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చి 1న లాసెట్ ,పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి( Limbadri) తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవిందర్, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మీతో కలిసి ఆయన విడుదల చేశారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని అధికారులు సూచించారు.ఈసెట్ షెడ్యూల్ ఇదే..అదే విధంగా ఈసెట్ షెడ్యూల్‌నూ అధికారులు ఖరారు చేశారు. మార్చి 1న ఈసెట్ (Ecet) నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. మార్చి 2 ( March) 2 నుంచి మే 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 15 నుంచి హాల్‌టికెట్లు జారీ చేసి 20వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ప్రవేశ పరీక్షల ఫీజులు భారంగా మారాయి. ఇప్పటికే ఎక్కువ ఉంటున్నాయనుకుంటే.. తాజాగా మరో రూ. వంద పెంచారు. ఓసీలతో సమానంగా బీసీ విద్యార్థుల ఫీజులను నిర్ణయించారు. జేఈఈ మెయిన్, నీట్ తదితర జాతీయ ప్రవేశపరీక్షలతో పాటు పక్కనున్న ఏపీలోనూ ఓసీలకు, బీసీలకు వేర్వేరు ఫీజులున్నాయి. కానీ రాష్ట్రంలో మాత్రం ఓసీలతో సమానంగా బీసీ అభ్యర్థులకు ఫీజులు వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ (Education) కౌన్సిల్ పరీక్షలు నిర్వహిస్తుంటుంది. ఎగ్జామ్ ఏర్పాట్లు, ఫీజులు, సిలబస్ అంతా సర్కారు ఆదేశాల మేరకు చేపడుతుంది. ఈ ఏడాది టీఎస్ ఎంసెట్ (EMCET), ఎడ్ సెట్, ఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, ఐసెట్ తదితర ఎగ్జామ్స్ తేదీలను అధికారులు ప్రకటించారు. దాదాపు అన్ని పరీక్షలను మే నెలలోనే నిర్వహిస్తున్నారు. ఒక్క ఎడ్ సెట్‌కు మినహా మిగిలిన అన్నింటికీ కొత్తవారే కన్వీనర్లుగా నియమితులయ్యారు.
ఇటీవల టీఎస్ ఎంసెట్, పీజీ ఈసెట్ షెడ్యూల్ రిలీజ్ చేయగా, ఈనెల 28న నోటిఫికేషన్లు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ రెండు పరీక్షలకు వంద చొప్పున ఫీజు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి ఒక ఫీజు, ఇతరులందరికీ ఒక ఫీజు నిర్ణయించారు. ఉదాహరణకు ఎంసెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు రూ.500 ఉంటే, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీలకు రూ.900 ఫీజు ఉంది. పీజీ ఈసెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు రూ.600 ఉంటే, మిగిలిన వారందరికీ రూ.1,100 ఫీజు పెట్టారు. ఓసీలు, బీసీలకు ఒకే ఫీజులను నిర్ణయించడంపై స్టూడెంట్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర ఎంట్రెన్స్‌లు రాస్తుంటారు. వాటిలో వచ్చే ర్యాంకు, వచ్చే కాలేజీని బట్టి కోర్సు ఎంచుకుంటారు. ఒక్కో అభ్యర్థి రెండు, మూడు ఎంట్రెన్స్‌లు రాయనుండటంతో.. ఈ స్థాయిలో ఉన్న ఫీజులు (Fees) వారికి భారంగా మారాయి. దీంతో అన్నింటికీ అప్లై చేసుకోవాలనుకునే వారికి ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి బీసీలకు ఫీజులు తగ్గించాలని స్టూడెంట్లు కోరుతున్నారు.