»Dont Compare Tarak With Manchu Lakshmi Actress Kasturis Comments
Kasturi’s : తారక్‌ని మంచు లక్ష్మితో పోల్చకండి నటి కస్తూరి కామెంట్స్
ఇటీవల ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ గోల్డెన్ అవార్డును అందుకున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) ఇంగ్లీషులో ప్రసంగించగా,ఆయన యాసపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ ది ఫేక్ యాక్సంట్ అంటూ, ఆయనను మంచు లక్ష్మితో పోల్చడం మొదలుపెట్టారు ఆయన అమెరికన్ (American) యాక్సెంట్లో మాట్లాడంలో అసలు తప్పేముందందని నటి కస్తూరి (Kastūri) కామెంట్ చేశారు.
ఇటీవల ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ గోల్డెన్ అవార్డును అందుకున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) ఇంగ్లీష్ ప్రసంగించగా,ఆయన యాసపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ ది ఫేక్ యాక్సంట్ అంటూ, ఆయనను మంచు లక్ష్మితో పోల్చడం మొదలుపెట్టారు ఆయన అమెరికన్ (American) యాక్సెంట్లో మాట్లాడంలో అసలు తప్పేముందందని నటి కస్తూరి (Kastūri) కామెంట్ చేశారు. నిజానికి అది గర్వించదగ్గ విషయం అంటూ తారక్‌పై ప్రశంసలు కురిపించింది. ‘అమెరికా వాళ్లకి వాళ్ల స్లాంగ్‌లోనే మాట్లాడితేనే అర్థమవుతుంది. మన ఇంగ్లీష్‌లో మాట్లాడితే వారికి అర్థం కాదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడారు. ఆ విషయంలో ఎన్టీఆర్ చేసింది కరెక్ట్. కానీ మన దగ్గర మాత్రం చాలా మంది ఆయనది ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్ చేశారు.
అది చాలా తప్పు. నేను కూడా అమెరికాలో ఉన్నాను, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమెరికా వాళ్లకి. వాళ్లలా మాట్లాడితేనే అర్థమవుతుందని ఆమె అన్నారు.ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ (Golden Globe) అవార్డును అందుకున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడిన తీరును ఇండియన్ నెటిజన్లు (Netizens) తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అమెరికా మీడియా, ఇంటర్య్వూలో ఎన్టీఆర్ అమెరికన్ ఇంగ్లీష్(english) యాక్సెంట్ వాడిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనిపై కొందరు పాజిటివ్‌గా స్పందించగా.. తెలుగు రాష్ట్రాల నెటిజన్లు ఎన్టీఆర్‌ను ట్రోల్ చేశారు.ఇక్కడ తెలుగుని స్పష్టంగా తెలుగులోనే మాట్లాడొచ్చు. కానీ తెలుగులో కూడా అక్కడి యాక్సెంట్ కలపడం ఎందుకు. వీరిద్దరికి చాలా డిఫరెంట్ ఉంది. ఈ విషయంలో వారిద్దరిని(జూనియర్ ఎన్టీర్, మంచు లక్ష్మిని) పోల్చ కూడదు’ అని ఆమె పేర్కొంది.