»A Shock To The Common Man Cooking Oil Prices Have Increased Again
Cooking Oil Prices: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన వంట నూనె ధరలు
సామాన్యులకు మళ్లీ షాక్ తగిలింది. కేవలం నెల రోజుల్లోనే వేరుశనగ నూనె(Peanut Oil) ధర మరోసారి పెరిగింది. లీటరుకు రూ.15 నుంచి రూ.20లకు చేరింది. ఫిబ్రవరి 26వ తేదికి వేరుశనగ నూనె(Peanut Oil) ధర లీటరుకు రూ.180కి చేరింది. పామాయిల్(Palm Oil) ధర చూసినట్లైతే లీటరుకు రూ.3 నుంచి రూ.5లకే పెరిగింది. దీంతో ప్రస్తుతం పామాయిల్(Palm Oil) ధర రూ.104లకు చేరింది. ఇకపోతే పొద్దుతిరుగుడు నూనె(Sunflower Oil) ధర లీటరకు రూ.135ల వద్ద స్థిరంగా ఉంది.

దేశవ్యాప్తంగా నూనె గింజల పంటల ఉత్పత్తి(Oilseed crops) తగ్గింది. విదేశాల్లో కూడా వేరుశనగ నూనె(Peanut Oil)కు డిమాండ్ బాగా పెరిగింది. ఈ కారణాల వల్ల ధరలు పెరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత మన దేశం నుంచి చైనా వేరుశనగ దిగుమతులను పెంచింది. చైనాలో వేరుశనగ నూనె(Peanut Oil)కు డిమాండ్ పెరిగింది. భారత దేశం 104 లక్షల టన్నుల వేరుశనగ ఉత్పత్తిని పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఫిబ్రవరి 14వ తేదికి 100 లక్షల టన్నులే వచ్చినట్లు తెలిపింది.
ఇకపోతే దేశంలో 9 రకాల నూనె గింజల పంటలు(Oilseed crops) కలిపి 423 లక్షల టన్నులను లక్ష్యంగా నిర్ణయించింది. అయితే ముందస్తు అంచనాల ప్రకారంగా చూస్తే 400 లక్షల టన్నుల మేర మాత్రమే వస్తుందని అంచనా వేసింది. దేశంలో వేరుశనగ సాగు, ఉత్పత్తిలో గుజరాత్ ముందంజలో నిలుస్తోంది. దేశం మొత్తం ఉత్పత్తిలో గుజరాత్ లోనే 45 శాతం పంట పండిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. ఇండోనేషియాలో ఎగుమతులపై ఆంక్షలు విధించడం వల్ల దేశంలో వంట నూనెల(Cooking Oil) ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు.