HYD: ప్రాణాంతకమైన చైనా మాంజాపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కొందరు అక్రమంగా దీనిని నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని, తాజాగా గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలో భారీగా మాంజాను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.