ELR: కలిదిండి మండలం మూలలంక గ్రామంలో వడ్లమన్నాడు – పెదలంక రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గురువారం శంఖుస్థాపన చేసారు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ.. సుమారు 4 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 2 కోట్ల రూపాయిల నిధులు మంజూరు చేసిందని త్వరలోనే నాణ్యమైన రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేస్తామన్నారు.