KMM: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్లో జనాభాలో 60%కు పైగా ఉన్న బీసీలకు 5% నిధులు కూడా కేటాయించలేదన్నారు. 42% రిజర్వేషన్లు ప్రతి ఏడాది రూ.20 వేల కోట్ల హామీలు అమలు కాలేదని మండిపడ్డారు. ఉద్యోగాల హామీలు నెరవేర్చకపోవడంతో యువత నిరాశలో ఉందన్నారు.