• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో భానుడి ప్రతాపం..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేసవికాలం పూర్తిగా ప్రారంభం కాకముందే భానుడు భగభగమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచే ఎండ ప్రతాపం తీవ్రంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు.

March 8, 2026 / 03:57 PM IST

ముగ్గురు కూతుళ్లను హత్యచేసిన తండ్రి రిమాండ్

KMR: ముగ్గురు కూతుళ్లను నిర్దాక్షిణ్యంగా చెరువులోకి తోసి హత్య చేసిన తండ్రిని రిమాండ్ చేసినట్లు KMR సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. సబ్ డివిజన్ కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. అప్పుల భారం 3 కూతుళ్లను పోషించలేకనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. నిందితుడిని కోర్టులో రిమాండ్ చేశామన్నారు.

March 8, 2026 / 03:50 PM IST

‘వంటగ్యాస్ ధరలు తగ్గించాలి’

JN: చిల్పూర్ మండలం కృష్ణాజిగూడెంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని నిరసన చేపట్టారు. సీపీఎం మండల కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. పెరిగిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, గ్యాస్ ధరల పెంపుతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

March 8, 2026 / 03:46 PM IST

భద్రాచలానికి భక్తుడి పాదయాత్ర

NRPT: ఉట్కూరు మండల కేంద్రానికి చెందిన శ్రీరామ మాలధారి ఆదివారం భద్రాచలం క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఇరుముడి కట్టుకుని రామనామ స్మరణతో ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా 14వ వార్డు సభ్యురాలు సువర్ణ రవికుమా, భక్తులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

March 8, 2026 / 03:42 PM IST

పేదలకు అండగా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే

NZB: సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. చంద్రయాన్ పల్లికి చెందిన ముత్తవ్వ అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శస్త్రచికిత్సకు రూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో ఆదివారం ఎమ్మెల్యే స్పందిస్తూ.. ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

March 8, 2026 / 03:42 PM IST

దేవాలయంలో అదనపు ఎస్పీ పూజలు

MDK: జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ఆదివారం చాకరిమెట్ల హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

March 8, 2026 / 03:40 PM IST

చట్టసభలో సగం సీట్లతోనే సాధికారత: ఐద్వా సంఘం

WNP: చట్టసభలో సగం సీట్ల రిజర్వేషన్‌తో మహిళ సాధికారత హక్కుల సాధన సాధ్యమైందని ఐద్వా సంఘం అధ్యక్షురాలు కళావతమ్మ తెలిపారు. ఆదివారం వనపర్తి జిల్లా సీపీఐ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చట్టసభలో 33 శాతం రిజర్వేషన్లు ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు జరుగుతున్న వివక్షత అణిచి వేయాలన్నారు.

March 8, 2026 / 03:39 PM IST

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: పొంగులేటి

KMM: మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్‌లో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ప్రభుత్వం రూ.23 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరిటే ఇస్తున్నామని పేర్కొన్నారు.

March 8, 2026 / 03:37 PM IST

మల్లికార్జున స్వామి దేవస్థానంలో పట్నాలు

SDPT: కోహెడ మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కోహెడలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మల్లన్న స్వామి పట్నాలు, ఒగ్గు కథల కార్యక్రమం నిర్వహించారు. ఒగ్గు పూజారులు స్వామివారి మహిమలను కథల రూపంలో వినిపించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల యాదవ సంఘం అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

March 8, 2026 / 03:35 PM IST

బాలికలకు ‘హెచ్పీవీ’ రక్షణ: కలెక్టర్

SRD: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 14–15 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఈ వయస్సులోనే టీకా వేయించడంతో భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు తప్పుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

March 8, 2026 / 03:35 PM IST

ఉత్తనూర్ గ్రామ సంఘాన్ని సందర్శించిన జెడ్పీ సీఈఓ

KMR: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మూడో రోజు ఉత్తనూర్ గ్రామ సంఘాన్ని జడ్పీ సీఈఓ చందర్ సందర్శించారు. ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తడి-పొడి చెత్తను వేరుచేసే విధానంపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఉన్నారు.

March 8, 2026 / 03:35 PM IST

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన

KNR: కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో వినూత్న నిరసన చేపట్టారు. పార్టీ శ్రేణులు గ్యాస్ సిలిండర్లను తలపై ఎత్తుకొని నిరసన తెలిపారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని, సామాన్యులపై భారం మోపడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవా రెడ్డి డిమాండ్ చేశారు.

March 8, 2026 / 03:34 PM IST

‘పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు ఒక వరం’

ADB: తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు గృహవసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

March 8, 2026 / 03:33 PM IST

ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు కాలనీ: సీఎం

HYD: ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు కాలనీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు CM రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులకు సన్మానం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఫ్యూచర్ సిటీలో కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే జర్నలిస్టులకు కూడా శుభవార్త చెబుతామని వెల్లడించారు.

March 8, 2026 / 03:31 PM IST

మహిళా కానిస్టేబుళ్లకు ఘనంగా సన్మానం

MHBD: కురవి పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు జీ.అనిత, ఈ.సుధారాణి, టీ.శ్రీవాణి, పుష్పలతలను ఎస్సై గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి, సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.

March 8, 2026 / 03:31 PM IST