ADB: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించింది. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులు రూ. 151 చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో లేదా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.
ADB: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రాంగణంలో నూతన వధూవరుల ఫొటో షూటింగ్‌లకు అనుమతి లేదని ఆలయ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. గతంలో షూటింగ్‌లకు అవకాశం ఉన్నప్పటికీ, ఈ ఏడాది నుంచి నాగోబా దేవస్థానంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు తీయరాదని నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.
ASF: గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, నూతన సంవత్సర 2026 క్యాలెండర్‌ను ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి గురువారం ఆవిష్కరించారు. MLA మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే TS-TWTU యొక్క ప్రధాన ఎజెండాగా కొనసాగాలని సూచించారు. CRT ఉపాధ్యాయుల సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
SRPT: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందన్నారు.
SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారం గ్రామ ప్రభుత్వ పాఠశాలను గురువారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని ఊట్ల పాఠశాలను పరిశీలించారు.
VKB: ఖాసీంపూర్ తండాకు చెందిన సరితకు పురిటినొప్పులు రావడంతో 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్‌ను నిలిపి ఈఎంటీ అవినాష్ చాకచక్యంగా అక్కడే డెలివరీ చేయగా, సరిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం వారిని తాండూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
VKB: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటెలెక్ట్యువల్ డిసెబిలిటీస్ ఆధ్వర్యంలో యూత్4జాబ్స్ సాకారం కోసం దివ్యాంగుల ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఫిబ్రవరి 27, 2026న సికింద్రాబాద్‌లోని NIEPID క్యాంపస్‌లో ఈ మేళా జరుగనుంది. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్, దివ్యాంగ ధృవీకరణ లేదా UDID కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలి.
RR: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, చేవెళ్ల మున్సిపల్ బీజేపీ వార్డ్ కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ పుట్టినరోజు సందర్భంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన దయాకర్‌ను ఎంపీ అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
SDPT: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి లేఖ రాశారు. గండిపల్లి పనులు కేవలం 40 శాతమే పూర్తయ్యాయని వెంటనే రూ.100 కోట్లు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని అన్నారు.
SRPT: కోదాడ పట్టణానికి తాగునీటిని అందించే మిషన్ భగీరథ మేజర్ పైపులైన్లకు జరుగుతున్న మరమ్మతు పనులను మున్సిపల్ ఛైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైపులైన్ పనుల్లో జాప్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
KNR: కరీంనగర్‌లో ప్రజా కలెక్టర్‌గా గుర్తింపు పొందారు. మహిళల కోసం ‘శుక్రవారం సభ’, ఆడపిల్లల రక్షణకు ‘ఓ చిన్ని పిచ్చుక’, ఇటుక బట్టీల పిల్లలకు ‘బ్రిక్ బుక్స్’ చేపట్టారు. దివ్యాంగుల కోసం సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని, ప్రభుత్వ దవాఖానలోనే సర్జరీ చేయించుకుని ప్రజలకు నమ్మకం కల్పించారు. కాగా, తాజా బదిలీల్లో ఆమె బదిలీ అయిన విషయం తెలిసిందే.
SRD: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో పటాన్‌చెరు డివిజన్ విద్యుత్ ఇంజినీరింగ్ అధికారి భాస్కరరావు రైతులతో సమావేశమై పొలాల్లో పర్యటించారు. వేసవి లోడును దృష్టిలో పెట్టుకుని బొంతపల్లి, గుమ్మడిదల సబ్ స్టేషన్లలో రూ.4 కోట్లతో రెండు 8 ఎంవిఎ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేశారు. కనుకుంట పరిధిలో రూ.15 లక్షలతో సమస్యలు పరిష్కరించారు.
SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు. విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. రోడ్డుపై పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
GDWL: ఉపాధి కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకు చేతివృత్తుల వారికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు కొండంత అండగా నిలుస్తాయి అని ఐపీఓ భాస్కర్ రెడ్డి అనారు. ధరూర్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో పీఎంఈజీపీ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ రంగాల వారికి లభించే సబ్సిడీలు, దరఖాస్తు విధానంపై వివరించారు.
VKB: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో జరిగిన జాతరలో పసిపాప మృతి పట్ల కొడంగల్ నియోజకవర్గం బీసీ యువ నాయకుడు శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని చూడకముందే పసిపాప కుల వివక్షతకు గురైందని, ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుని, పాప కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందజేయాలని ఆయన సూచించారు.