• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కరీంనగర్ జిల్లా కలెక్టర్ బదిలీ

KNR: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా కరీంనగర్ జిల్లా యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. ఆమెను లేబర్ స్పెషల్ కమిషనర్గా నియమించారు. అలాగే జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు కూడా బదిలీ అయ్యారు. ఆయనను నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

February 26, 2026 / 09:01 AM IST

హెడ్ కుక్ పోస్టుకు దరఖాస్తు ఆహ్వానం

NZB :ధర్‌పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహంలో ఔట్సోర్సింగ్ విధానంలో హెడ్ కుక్ (వంట మనిషి) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తును వసతి గృహ కేర్ టేకర్ స్వరూపకు అందజేయాలన్నారు. వేతనం రూ.7800 ఉంటుందన్నారు.

February 26, 2026 / 09:01 AM IST

హైకోర్టు స్టే ఉన్నా ప్రహరీ పనులు

NZB: ఎన్టీఆర్ కాలనీ వైపు ప్రహరీ నిర్మాణంపై హైకోర్టు మూడు వారాల స్టే విధించినప్పటికీ ఆర్మూర్ ఆర్టీసీ అధికారులు పనులు ప్రారంభించేందుకు ప్రయత్నించగా వివాదం నెలకొంది. స్టే విషయం కాంట్రాక్టర్‌కు తెలియజేయకపోవడంతో పనులు మొదలుపెట్టగా కాలనీవాసులు కోర్టు ఉత్తర్వుల ప్రతిని చూపించడంతో పనులు నిలిచిపోయాయి.

February 26, 2026 / 08:56 AM IST

జాతీయ స్థాయి శిక్షణకు సర్పంచ్ శివమణి

SRD: మహిళా సాధికారతపై జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గం జీర్లపల్లి గ్రామ సర్పంచ్ అమరేశ్వరి శివమణి ఎంపికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎంపికైన ఐదుగురు సర్పంచులలో ఈమె ఒకరు. తక్కువ కాలంలోనే గ్రామాభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. ఫిబ్రవరి 25న జరిగే ఈ శిక్షణలో ఆమె పాల్గొననున్నారు.

February 26, 2026 / 08:50 AM IST

HYDలో ఆకలి తీర్చే చేతులెన్నో!

HYD: ఇంటికి వచ్చిన వారికి మంచినీళ్లు పోసే గుణం మన సొంతం. అలాంటిది మనోళ్లు HYDలో ఆకలితో అలమటిస్తున్నవారికి కడుపునిండా బువ్వ పెట్టే చేతులయ్యారు. సికింద్రాబాద్, మెహిదీపట్నం, రెడ్‌హిల్స్, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో నిత్యం పేదల కడుపు నింపేందుకు అన్నదాన వితరణ చేస్తుంటారు. వ్యాపారవేత్తల నుంచి విద్యార్థుల వరకు తమ చేతికి తోచిన సాయం చేస్తున్నారు.

February 26, 2026 / 08:50 AM IST

బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

MDK: అల్లాదుర్గంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముప్పారం గ్రామానికి చెందిన సనుబాల వీరేశం(41) పని నిమిత్తం అల్లాదుర్గం వచ్చి, తిరిగి తన బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.

February 26, 2026 / 08:49 AM IST

ఇజ్రాయిల్ దాడుల వెనుక వారి పాత్ర! HYDలో నిరసనలు

HYD: IPSP, BDS ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రిలయన్స్ ఔట్‌లెట్ వద్ద HYD ప్రజలు ఇజ్రాయిల్ దాడుల విషయంలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసనలు చేశారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడుల విషయంలో రిలయన్స్ అధినేత పాత్ర ఉందని ఆరోపిస్తూ సంస్థపై బహిష్కరణకు పిలుపునిచ్చారు. పోలీసుల పర్యవేక్షణలో ఆందోళన శాంతియుతంగా సాగింది.

February 26, 2026 / 08:47 AM IST

‘విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలి’

BHNG: ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాయాలని, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష నిర్వహణను ఆయన సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.

February 26, 2026 / 08:45 AM IST

ఆడబిడ్డల వివాహానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

MBNR: ఆడబిడ్డల వివాహానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు ప్రభుత్వం లబ్ధి చేస్తుందని పేర్కొన్నారు.

February 26, 2026 / 08:44 AM IST

కాంటోన్మెంట్ సిబ్బంది నిర్లక్ష్యం.. నెలలు తరబడి చెత్త

HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నాలాలో నెలలు తరబడి చెత్త చెదారంతో నిండి దుర్వాసన వస్తున్నా సంబంధిత సిబ్బంది ఏమీ పట్టనట్లు ఉంటున్నారని ఆశిష్ గార్డెన్ నాలా వద్ద స్థానికులు వాపోతున్నారు. చెత్తసేకరించి జీవించే వాళ్లు కొంత ప్లాస్టిక్ బాటిల్ వంటి పదార్థాలు తీసుకుపోతున్నారు. సిబ్బంది మాత్రం నాలా శుభ్రం చేయడం లేదని, వెంటనే నాలా శుభ్రం చేయాలని కోరుతున్నారు.

February 26, 2026 / 08:43 AM IST

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

HYD: ఉస్మానియా మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు ప్రాతిపదికన 8 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. రాజారావు తెలిపారు. దరఖాస్తులను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 5 వరకు ప్రిన్సిపల్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

February 26, 2026 / 08:42 AM IST

సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలి: కలెక్టర్

NLG: ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను పేదల దరి చేర్చాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేర్చడంలో గెజిటెడ్ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు.

February 26, 2026 / 08:42 AM IST

40 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత

NZB: అక్రమంగా తరలించడానికి నిలువ ఉంచిన 40 క్వింటాళ్ల PDS బియ్యంతో పాటు బొలెరో వాహనాన్ని సీజ్ చేసినట్లు నిజామాబాద్ CCS CI సాయినాథ్ తెలిపారు. NZB వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్చి కంపౌండ్, కెనాల్ కట్ట, ఎరుకలవాడలో షేక్ సాహెబ్ హుస్సేన్ ఇంట్లో CCS టీమ్ దాడి చేసినట్లు చెప్పారు. PDS బియ్యంతో పాటు బోలోరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

February 26, 2026 / 08:38 AM IST

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్

VKB: పరిగి పట్టణంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో గంజాయి విక్రయాలకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నితీశ్ రఝాక్(22), సూరజ్ కుమార్(22) వద్ద నుంచి సుమారు 1.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి తెచ్చి కార్మికులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడి నిర్వహించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

February 26, 2026 / 08:35 AM IST

సూర్యాపేటలో 298 మ్యూల్ అకౌంట్స్ గుర్తింపు

SRPT: TG పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని 4 బ్యాంక్ బ్రాంచ్‌లలో 298 అనుమానాస్పద మ్యూల్ ఖాతాలను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 137 బ్రాంచ్‌లపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడులు నిర్వహించింది. సరైన వెరిఫికేషన్ లేకపోవడంతో నేరగాళ్లు ఈ ఖాతాల ద్వారా సైబర్ దందాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు.

February 26, 2026 / 08:34 AM IST