NZB: వేల్పూరు మండలం మోతె గ్రామంలోని BC కాలని గొల్ల బండలు ఏరియాలో ఉన్న మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలకు బస్టాప్ సౌకర్యం లేకపోవటం వలన ఇబ్బందులకు గురవుతున్నారు అన్ని యువకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యర్థం బస్సు షెల్టర్ ఏర్పాటు చేసుకోవటానికి అనువుగా ఉన్న స్థలాన్ని కేటాయించమని గ్రామ సర్పంచ్ రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ పరంజ్యోతిలకు వినతి పత్రం అందజేశారు.
MNCL: దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభలకు తరలి రావాలని ఆ సమితి జిల్లా కార్యదర్శి పోచయ్య కోరారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలో ఆ సమితి నాయకులతో సమావేశం నిర్వహించారు. మందమర్రి పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో డీహెచ్పీఎఫ్ జిల్లా మహాసభలు ఏప్రిల్ 2న జరగనున్నాయని వెల్లడించారు. ఆ మహాసభలకు అందరూ రావాలని ఆయన కోరారు.
HYD: ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలకు నెలవైన ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తికి సమానమైన హక్కులున్నాయని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. వారు మాట్లాడుతూ.. కొంతమంది మానవత్వాన్ని మరచి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ప్రవర్తిస్తున్నారని, అలాంటి వారిని కట్టడి చేయాలంటే ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరమన్నారు. యావత్ రాష్ట్రం ఈ చట్టాన్ని స్వాగతిస్తుందన్నారు
JGL: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని భీమారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి అన్నారు. రంగాపూర్ గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సర్పంచ్ కావేరి, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.
MDCL: శామీర్‌పేట్ డివిజన్ దేవరయాంజాల్ గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సూర్యప్రభ సేవను ఘనంగా నిర్వహించారు. ఈవో వీరేశం పర్యవేక్షణలో, అర్చకులు కందాళ సీతారామ చార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని సూర్యప్రభ వాహనంపై గ్రామంలో ఊరేగించారు. ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొని హారతులు, భజనలు నిర్వహించారు.
BHNG: యాదాద్రి దేవస్థానం హుండీ ఆదాయం నేడు లెక్కించారు. అందులో 16 దేశాల కరెన్సీ వచ్చినట్లు EO భవానీ శంకర్ తెలిపారు. అందులో అమెరికా 248, ఆస్ట్రేలియా 55, ఇంగ్లాండ్15, కెనడా 10, దీరమ్స్ 60, నేపాల్ 10, యూరప్ 5, రియాల్ 201/2, థాయిలాండ్ 220, ఇండోనేషియా 1000, వియత్నం 2,000, సింగపూర్ 27, టాంజానియా 20,000, సౌదీ అరేబియా 50, న్యూజిలాండ్ 20, యూరో 10 కరెన్సీలు వచ్చాయి.
SRD: జిన్నారం మున్సిపాలిటీ రాళ్లకత్వ గ్రామంలో సర్వే నంబర్ 286లోని అసైన్డ్ భూమి నుంచి కొందరు అక్రమంగా మొరం తరలిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే తవ్వకాలు నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.
GDWL: ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవకు సమయం కేటాయించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. సోమవారం గద్వాల కలెక్టరేట్లో పదవీ విరమణ చేసిన జిల్లా యువజన క్రీడల అధికారి కృష్ణయ్యను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. కృష్ణయ్య తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
NGKL: శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించేందుకు మంగళవారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ఎమ్మెల్యేలు రానున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. వేసవి దృష్ట్యా సాగునీటి ఎద్దడి కలగకుండా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని అధికారులతో చర్చించనున్నారు. అనంతరం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
GDWL: మనం తినే ఆహారం కల్తీ అయితే అది ప్రాణాంతకం, అందుకే ప్రతి హోటల్, రెస్టారెంట్ పక్కాగా నిబంధనలు పాటించాల్సిందే అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లలో వంటకు వాడే నూనెలు, ఇతర సరుకుల నాణ్యతను తరచూ పరిశీలించాలన్నారు.
WNP: ఫిర్యాదులపై పోలీస్ అధికారులు, ఇబ్బంది తక్షణమే స్పందించాలని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 9 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఫిర్యాదు చేసిన ప్రతి ఫిర్యాదుపై ఆమె స్పందిస్తూ బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
KMR: కలెక్టరేట్లో నేడు నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుంచి 117 దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం కాని దరఖాస్తులపై బాధితులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ ఉన్నారు.
GDWL: జనాభా గణనలో భాగంగా చేపట్టే ఇళ్ల గణనను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతీ హోళికేరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
MDK: పంట మార్పిడి వల్ల రైతులకు లాభం చేకూరుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో సోమవారం పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతిసారి ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుందని తద్వారా దిగుబడి తగ్గుతుందన్నారు. ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల అధిక లాభం వస్తుందని వెల్లడించారు.
ADB: ITDAలో పదో తరగతి అర్హత లేని వారిని కూడా CRTలుగా నియమించాలని, అక్రమంగా ఉద్యోగాలు పొందిన 60 మంది CRT ఉద్యోగస్తులపై విచారణ జరపాలని నిరుద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఉట్నూరులో ‘చలో ఐటీడీఏ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.