WNP: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్రీలత తెలిపారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోపాల్, పోలీసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: చిట్యాల పట్టణంలో రోడ్డు పనులతో పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఛైర్మన్, పాలకవర్గానికి సీనియర్ ఉద్యమ నాయకులు పోలేపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలకు కారణమైన వాహనాలను గుర్తించలేక బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారని, చోరీల నియంత్రణకు కూడా ఇవి అవసరమని ఆయన పేర్కొన్నారు.
WGL: విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అందించాలనే ఉద్దేశంతో ఈ సెల్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుశ్రుత ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ మాలోతు రవీందర్ చౌకీదార్ కళాశాలకు యాభై వేల రూపాయల విలువైన పుస్తకాలను విరాళంగా అందజేశారు.
NGKL: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 7 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.
MLG: చెక్ బౌన్స్ కేసులో ఒక వ్యక్తికి కోర్టు 30 రోజుల జైలు శిక్ష విధించింది. 2023లో శంకర్‌కు శ్రీనివాస్ రూ.8 లక్షల అప్పుకు చెక్ ఇచ్చాడు. బ్యాంకులో వేయగా చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు కేసు వేశాడు. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి శిక్ష విధించారు. ఈ విషయాన్ని ఎస్సై ఉపేందర్ తెలిపారు.
SRPT: హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత సాంకేతిక సంస్థలో 2026-27 విద్యాసంవత్సరానికి డిప్లొమా ప్రవేశాలు ప్రారంభమైనట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. పదో తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని, అర్హులైన విద్యార్థులకు నెలకు రూ.2,500 స్టైపెండ్ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు.
BDK: జిల్లాలోని 26వ డివిజన్‌కు చెందిన దుంపల రాజేష్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్లకార్డ్ ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను వెల్లడించారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ డ్రైవర్లకు సరైన జీతాలు ఇవ్వడం లేదని, ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
MDK: ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పెద్ద శంకరంపేట మండల ప్రత్యేక అధికారి జగదీష్ అన్నారు. సోమవారం పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజావాణిలో 2 దరఖాస్తులు వచ్చినట్లు వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభుదాసు పాల్గొన్నారు.
MDCL: భార్య మందలించిందని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్కేసర్ PS పరిధిలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన పన్నీరు నరసింహ(45) రోజూ మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు. ఈ విషయమై భార్య మందలించడంతో మనస్థాపానికి గురై సోమవారం ఉదయం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.
సిరిసిల్ల బార్ అసోసియేషన్ నూతన కమిటిని ఇవాల ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆవునూరి రమాకాంత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమాకాంత్ మాట్లాడుతూ.. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. అతనికి పలువురు శుభకాంక్షలు తెలిపారు.
HNK: హన్మకొండ నగరంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 142/2022 నమోదైన పాక్సో కేసులో సోమవారం న్యాయమూర్తి అపర్ణ దేవి నిందితుడు వల్లేపు రాజుకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేయడంతో బాధితురాలికి న్యాయం జరిగిందని ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వేడుకకు వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో తల్లీకుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది
JN: IRC(ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్) నియమాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు నియాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో DCP రాజమహేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
NRPT: జనగణన-2027లో భాగంగా జిల్లాలో మొదటి విడత ఇళ్ల గణన ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీకేరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి కలెక్టర్లు, జిల్లా జనగణన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మ్యాపుల తయారీ, సూపర్వైజర్ల నియామకం, గణనపై దిశానిర్దేశం చేశారు. తప్పులు దొర్లకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
NGKL: లింగాల మండలంలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన సలేశ్వరం లింగమయ్య క్షేత్రం ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక్కడి జలపాతం లోతైన అడవిలో ఉంటూ ఏడాది పొడవునా పారుతూ ఉండటం విశేషం. ముఖ్యంగా భానుడి భగభగలాడే ఎండాకాలంలో కూడా ఇక్కడ చల్లని నీరు ప్రవహిస్తూ భక్తులకు కనువిందు చేస్తుంది.