ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన ఈదురుగాళ్లతో కూడిన వర్షానికి అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, జొన్న పంటతోపాటు మామిడి సాగు చేస్తున్న రైతులకు పంట చేతికొచ్చే సమయానికి నేలపాలైంది. అకాల వర్షాలకు పంటలు పూర్తిగా నష్టపోవడంతో క్షేత్రస్థాయిలో అధికారులు సందర్శించి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.