• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘పాపన్న గౌడ్ అడుగుజాడల్లో నడవాలి’

కామారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అడుగుజాడల్లో నడవాలని కల్లుగీత కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు సైదగౌని వెంకట్ గౌడ్ చెప్పారు. గురువారం పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చేసిన సేవలను కొనియాడారు.

April 2, 2026 / 03:50 PM IST

ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలి: ఛైర్పర్సన్

VKB: తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని పరిగి మున్సిపల్ ఛైర్పర్సన్ రజిత వెంకటేష్ తెలిపారు. ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం 16వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.

April 2, 2026 / 03:48 PM IST

‘పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం’

RR: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

April 2, 2026 / 03:48 PM IST

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

NGKL: కల్వకుర్తి పట్టణంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. పట్టణ వీధుల్లో శోభాయాత్ర, బైక్ ర్యాలీతో సందడి నెలకొంది. ఎటుచూసినా కాషాయ జెండాలతో పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భద్రత కల్పించారు.

April 2, 2026 / 03:47 PM IST

కబడ్డీ కోచ్‌ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

SRPT: కోదాడ కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఖేలో ఇండియా సెంటర్లో కబడ్డీ శిక్షణ ఇచ్చేందుకు సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఈరోజు జిల్లా క్రీడల అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల వారు తమ సర్టిఫికెట్లతో ఈ నెల 10వ తేదీలోపు సూర్యాపేటలోని జిల్లా కార్యాలయంలో సంప్రదించాలనీ ఆయన తెలిపారు.

April 2, 2026 / 03:43 PM IST

గొప్ప మనసు చాటుకున్న మేయర్ గుమ్మాల మమత

మహబూబ్‌నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ తన గొప్ప మనసును చాటుకున్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పదవి డివిజన్‌లో కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా భూత్పూర్‌కు చెందిన 19 ఏళ్ల నవీన్ ఎంవీఎస్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే స్పందించిన మేయర్ అంబులెన్స్ కోసం చూడకుండా క్షతగాత్రుడిని తన వాహనంలో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించారు.

April 2, 2026 / 03:42 PM IST

సమస్యలను పరిష్కరించుకుందాం:సర్పంచ్

NRPT: గుండుమల్ మండల పరిధిలోని కొమ్మూరు గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వనజ రాని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు తెలుసుకొని వాటిపై అవగాహన తెచ్చుకొని సమస్యలను పరిష్కరించుకుందామని ఆమె గ్రామసభలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి అనురాధ తదితరులు పాల్గొన్నారు.

April 2, 2026 / 03:40 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని మృతి

SDPT: చేర్యాల పాత బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆకునూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని కీర్తన (17) మృతి చెందింది. ప్రమాదం అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. చేర్యాలలో ఇంటర్ చదువుతున్న కీర్తన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

April 2, 2026 / 03:39 PM IST

కబడ్డీ ఆడి సందడి చేసిన ఎమ్మెల్యే

ADB: తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలో నెలకొన్న ప్రసిద్ధ హనుమాన్ ఆలయాన్ని బోథ్ MLA అనిల్ జాదవ్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యువకులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు. యువకులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

April 2, 2026 / 03:37 PM IST

గ్రామసభలో ఆత్మహత్యాయత్నం

KMR: జిల్లా భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామసభ ప్రాంగణంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గొల్ల రాములు అనే వ్యక్తి గతంలో పొందిన పెన్షన్ ప్రస్తుతం నిలిచిపోయిందని, పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ చెట్టెక్కి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్పందించిన గ్రామ పాలకవర్గ సభ్యులు అతడిని కాపాడారు.

April 2, 2026 / 03:35 PM IST

1,300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు: CP

NZB: హనుమాన్ శోభాయాత్రను శాంతి యుతంగా నిర్వహించేందుకు 1,300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు NZB CP సాయి చైతన్య తెలిపారు. అలాగే CC, డ్రోన్ కెమెరాలు, బైనాక్యులర్‌లతో 24/7 పటిష్ఠమైన నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. NZBతో పాటు ఖమ్మం, రాజన్న సిరిసిల్ల , భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి పోలీస్ సిబ్బందిని రప్పించామన్నారు.

April 2, 2026 / 03:32 PM IST

‘నియోజకవర్గాన్ని SC రిజర్వేషన్‌గా చేయాలి’

ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని SC రిజర్వేషన్‌గా చేయాలని తెలంగాణ దళిత యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్ల సునీల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో AO కిరణ్‌కి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో SC వర్గానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. SCలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం చాలా అవసరమన్నారు.

April 2, 2026 / 03:30 PM IST

వర్ధన్నపేట సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం: ఛైర్మన్

WGL: వర్ధన్నపేట సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ 8వ వార్డులో నిర్వహించిన వార్డు సభకు ఛైర్మన్ హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ స్పష్టం చేశారు.

April 2, 2026 / 03:30 PM IST

బాధితులను కాపాడితే రూ.25 వేలు: ఎస్పీ

SRCL: జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే వారి కోసం ‘రహ్ వీర్’ (Rah-Veer) పథకాన్ని ప్రకటించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాద సమయాల్లో గాయపడిన వారికి తక్షణ సాయం అందించి ప్రాణాలు కాపాడే బాధ్యతగల పౌరులకు రూ. 25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తామని వెల్లడించారు.

April 2, 2026 / 03:30 PM IST

‘విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపాలి’

PDPL: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని ధర్మారం MEO ప్రభాకర్ సూచించారు. ఇవాళ ఆయన పైడిచింతలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎన్ఆర్ఐ బద్దం సంధ్య సృజన్ రెడ్డి నిర్మించిన డైనింగ్ హాల్‌ను సర్పంచ్ సున్నం రాజయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించుటకు ముందుకు వచ్చిన సృజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

April 2, 2026 / 03:30 PM IST