• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మైనర్లకు సిగరెట్లు, గుట్కాలు విక్రయిస్తే రూ.5 వేల జరిమానా

NRML: మామడ మండలం కొరిటికల్ గ్రామ అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం పంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్లాస్టిక్ నియంత్రణకు ఇప్పటికే స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసింది, తాజాగా గ్రామంలో మైనర్ల ఆరోగ్యంపై దృష్టి సారించి 18 ఏళ్ల లోపు వారికి సిగరెట్లు, గుట్కాలు విక్రయిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.

April 4, 2026 / 09:40 AM IST

కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్

KMM: వైరా మండలం భాగ్యనగర్ తండా గ్రామానికి చెందిన గూగుల్ ఒక లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ హిరాలాల్ లక్ష్మీ పార్థివదేహాన్ని సందర్శించిన అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారితోపాటు ఉప సర్పంచ్ దిక్కులాల్ మాజీ ఎంపీటీసీ రామచంద్రనాయక్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

April 4, 2026 / 09:38 AM IST

అందులో అమ్మాయిలే ఫాస్ట్..!

HYD: ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగంలో అమ్మాయిలు ముందంజలో ఉన్నట్లు తాజా టెక్ Z సర్వే వెల్లడించింది. అబ్బాయిల కంటే అమ్మాయిలు 81% ఎక్కువగా AI టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చదువు, ప్రాజెక్టులు, డిజిటల్ పనుల్లో అమ్మాయిల వినియోగం గణనీయంగా పెరిగింది. టెక్నాలజీలో వారి చురుకుదనం స్పష్టమవుతోందని పేర్కొంది.

April 4, 2026 / 09:38 AM IST

సూసైడ్‌కు పాల్పడిన బీటెక్ విద్యార్థిని

KMM: తిరుమలాయపాలెం మండలం బీరోలుకి చెందిన బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. గ్రామానికి చెందిన బూరుగు మైన కోదాడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతుంది. శుక్రవారం సాయంత్రం కాలేజి భవనం నుంచి దూకడంతో రెండు కాళ్లు విరిగాయి. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

April 4, 2026 / 09:36 AM IST

108 అంబులెన్సు తనిఖీ చేసిన మేనేజర్

జగిత్యాల జిల్లా కేంద్రంలోని నియోనాటల్ 108 అంబులెన్స్‌ను శుక్రవారం 1962 స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ బాగిష్ మిశ్రా తనిఖీ చేశారు. నియోనాటల్ ఇంకుబేటర్, వెంటిలేటర్, సక్షన్ ఆపరేటర్, మల్టీ ఛానల్ మానిటర్, ఏఈడీతో పాటు ఇతర వైద్య పరికరాల పనితీరు, ఆక్సిజన్, మందులను, పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

April 4, 2026 / 09:36 AM IST

అక్రమంగా తరలుతున్న ఇసుక లారీలు పట్టివేత

SRD: అక్రమంగా కర్ణాటక ఇసుక తరలిస్తున్న మూడు లారీలను న్యాల్కల్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం కరీంనగర్ నుంచి మండలంలోని శంశోల్లాపూర్ గ్రామ శివారులో జహీరాబాద్ -బీదర్ రోడ్డు మార్గంలో ఎస్సై దోమ సుజిత్ తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను హద్నూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.

April 4, 2026 / 09:34 AM IST

నేడు ఉచిత కంటి పరీక్షల శిబిరం

SRD: సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత కంటి పరీక్షల శిభిరాన్ని నేడు నిర్వహిస్తున్నారని సర్పంచ్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఖేడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి దవాఖాన వైద్య నిపుణలు కంటి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కంటి చూపు లోపించిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, కంటి చూపులో పొర వచ్చిన వారికి ఉచిత కంటి ఆపరేషన్ కూడా చేస్తారని తెలిపారు.

April 4, 2026 / 09:34 AM IST

శరవేగంగా వంతెన నిర్మాణ పనులు

MBNR: మూసాపేట్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని గుత్తేదారు సూచించారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేశామని, రాత్రి వేళల్లో 60-70 కి.మీ వేగంతో కాకుండా నెమ్మదిగా ప్రయాణించాల్సిందని, ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

April 4, 2026 / 09:30 AM IST

గద్వాల్ మున్సిపల్ ఖర్చు లెక్కల కలకలం

GDWL: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల తర్వాత ఖర్చు లెక్కల సమస్యలు తలెత్తాయి. 298 మంది అభ్యర్ధులలో 74 మంది ఇంకా ఖర్చు వివరాలు సమర్పించలేదు. గద్వాల్, అయిజ్, అలంపూర్, వడ్డేపల్లి పరిధిలో లెక్కలు చెప్పకపోతే, వచ్చే ఎన్నికల్లో అనర్హత విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

April 4, 2026 / 09:29 AM IST

జాగృతిలో చేరిన జిల్లా నేతలు

HNK: హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు నేతలు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. కవిత మాట్లాడుతూ.. జాగృతి విధానాలను ప్రజల్లోకి నేతలు విస్తృతంగా తీసుకెళ్లాలని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు శ్రీశైలం, శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు.

April 4, 2026 / 09:28 AM IST

దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

NLG: సీఐడీ కార్యాలయం ముట్టడి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్‌ను దేవరకొండలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఐడీ విచారణ పేరుతో వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని కోరారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలు ఆపలేరని అన్నారు. అభివృద్ధి మరిచి అరెస్టులా అని అన్నారు.

April 4, 2026 / 09:23 AM IST

సూర్యాపేట లో రెండు రోజుల పాటు మీసేవ బంద్

SRPT: సాఫ్ట్వేర్ అప్డేడేట్ కారణంగా సూర్యాపేట జిల్లావ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ పనుల వల్ల శుక్రవారం రాత్రి నుంచే ఈ అంతరాయం ఏర్పడింది. సుమారు 36 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుండగా.. శని, ఆదివారాలు సెలవులు కావడంతో తిరిగి సోమవారం ఉదయం నుంచే సేవలు అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు తెలిపారు.

April 4, 2026 / 09:16 AM IST

ఎరువుల దుకాణాల్లో ఏవో తనిఖీలు

MHBD: బయ్యారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో శుక్రవారం ఏవో కే. రాజు తనిఖీలు నిర్వహించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మార్చి 31 నుంచి పారాక్వాట్ నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మందు విక్రయం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధమని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 4, 2026 / 09:16 AM IST

జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవానికి MLA కు ఆహ్వానం

KMR: బాన్సువాడలో ఈ నెల 5న నిర్వహించే బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలలో సందర్భంగా ఆ సంఘం నాయకులు శనివారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. సంఘం డివిజన్ అధ్యక్షుడు దొబ్బల గంగాధర్ మాట్లాడుతూ.. పాత బాన్సువాడ నుంచి భారీ ర్యాలీ ఎత్తున ర్యాలీలతో కదలి వచ్చి మున్సిపాలిటీ వద్ద జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించనున్నాట్లు తెలిపారు.

April 4, 2026 / 09:16 AM IST

పినపాకలో ప్రారంభమైన ఇంటింటి సర్వే

BDK: పినపాక మండలంలోని బోటుగూడెం గ్రామంలో సెర్ఫ్ పర్యవేక్షణలో శనివారం సిఆర్పిలు ఇంటింటి సర్వే నిర్వహించారు.పేదరికాన్ని కచ్చితంగా అంచనా వేసి, అర్హులను గుర్తించడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రతి కుటుంబాన్ని సందర్శించి వారి ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు, ఇతర అవసరాల వివరాలను సేకరించారు.

April 4, 2026 / 09:15 AM IST