• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పిడుగుపాటుకు మహిళ మృతి

NGKL: వంగూరు మండలం నిజామాబాద్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షం కురుస్తున్న సమయంలో తన వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్న ఇడమోని లక్ష్మమ్మ (32) అనే మహిళపై పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో చెట్టు కింద తలదాచుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

March 30, 2026 / 07:35 PM IST

‘సొంత ఆదాయం పెంపుదల, పారిశుధ్యంపై దృష్టి సారించాలి’

WNP: కొత్తకోట పురపాలక సంఘం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక అంచనా బడ్జెట్‌ను మున్సిపల్ ఛైర్మన్ అరుణ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సొంత ఆదాయాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం చేయడంపై దిశా నిర్దేశం చేశారు.

March 30, 2026 / 07:35 PM IST

వాసవి కళ్యాణ మండపానికి విరాళం

GDWL: అలంపూర్ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామివార్లను ముంబైకి చెందిన సుధారాణి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వాసవి నిత్యాన్నదాన సత్రం నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపం కోసం రూ.55,555 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సత్రం ఛైర్మన్ రమేశ్ గుప్త దాతలను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

March 30, 2026 / 07:35 PM IST

బోరు పైపులు తొలగింపు.. కలెక్టర్‌కు ఫిర్యాదు

WGL: పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ప్రభుత్వ మంచినీటి బోరును పైపులతో సహా తొలగించి వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు బానోతు దస్రు, భాను, వినోద్‌పై సోమవారం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. మండల అధికారులకు పలుమార్లు చెప్పిన చర్యలు తీసుకోలేదని తండావాసులు తెలిపారు.

March 30, 2026 / 07:34 PM IST

సీడీపీవోకు వినతి పత్రం సమర్పణ

MNCL: అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం లక్షెట్టిపేటలోని సీడీపీవో కార్యాలయంలో స్థానిక సీడీపీవో రేష్మకు అంగన్వాడీ టీచర్లతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అంగన్వాడి టీచర్లకు మే నెలలో సెలవులు ఇవ్వాలన్నారు. వారి పెండింగ్ వేతనాలు చెల్లించి సమస్యలు పరిష్కరించాలన్నారు.

March 30, 2026 / 07:31 PM IST

పోలీసులకు ప్రశంసాపత్రాలు అందజేసిన ఎస్పీ

మహబూబాబాద్: జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న పలు కేసులను సమర్థవంతంగా చేదించి, నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అభినందించారు. ఈ సందర్భంగా వారికి సోమవారం ప్రశంసాపత్రాలు అందజేశారు. పోలీసు శాఖలో కృషి, నిబద్ధతతో పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించడం ఎంతో ముఖ్యమని ఎస్పీ అన్నారు.

March 30, 2026 / 07:31 PM IST

‘ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి’

KNR: గంగాధర మండలం ఉప్పర మల్యాలలో నీటి కొరతతో ఎండిపోయిన పంట పొలాలను రాజ్యాధికార పార్టీ నాయకుడు కొప్పుల వెంకటేష్ సందర్శించారు. చెరువుకు చేరువలో ఉన్నా సాగునీరు అందక పంటలు ఎండిపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30 వేల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

March 30, 2026 / 07:29 PM IST

గ్రామ/వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు:కలెక్టర్

NZB: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన గ్రామ పంచాయతీల్లో నిర్వహించనున్న గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు.

March 30, 2026 / 07:27 PM IST

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏసీపీ

JN: పాలకుర్తి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో వివిధ వాహన డ్రైవర్లకు ఏర్పాటు చేసిన ‘అరైవ్ -అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏసీపీ అంబటి నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క డ్రైవర్ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఐ జానకి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

March 30, 2026 / 07:26 PM IST

గుంటూరులో పర్యటించిన మార్కెట్ కమిటీ సభ్యులు

HNK: స్టడీ టూర్లో భాగంగా గుంటూరు, తెనాలి మార్కెట్లను కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు సందర్శించి మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతున్న తీరు, లావాదేవీలను పరిశీలించారు. మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ ఝాన్సీరాణి రవీందర్ మాట్లాడుతూ.. కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

March 30, 2026 / 07:26 PM IST

బాల కార్మికుల నిర్మూలనపై ప్రత్యేక డ్రైవ్

MLG: జిల్లాలో బాల కార్మిక నిర్మూలన కోసం ప్రత్యేక బృందాల తనిఖీలు చేపట్టారు. కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టొద్దని, 18 లోపు ప్రమాదకర పనులకు నిషేధం అని తెలిపారు. సుమారు 100 మంది రైతులకు నోటీసులు జారీ చేసి అవగాహన కల్పించారు. నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 30, 2026 / 07:18 PM IST

‘మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’

WGL: నల్లబెల్లి(M) కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే అంగడికి సుమారు 29 GP ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కూరగాయలు, ఇతర వస్తువుల విక్రయాలు నిర్వహిస్తున్నారు. అయితే పబ్లిక్ టాయిలెట్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉప సర్పంచ్ DLPOకు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని తెలిపారు.

March 30, 2026 / 07:16 PM IST

క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్‌కి వినతి

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జనకాపూర్ వద్దగల క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ హరితకి DYFI, KVPS ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. అనేక మంది క్రీడాకారులు క్రీడలలో నైపుణ్యం కలిగి ఉండి సరైన క్రీడ మైదానం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మైదానాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.

March 30, 2026 / 07:15 PM IST

శాయంపేటలో బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం..

HNK: శాయంపేట రైతు వేదికలో బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహాసీల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, త్వరలో చేపట్టబోయే హౌస్-టు-హౌస్ సర్వే ద్వారా డబుల్ (బోగస్) ఓటర్లను గుర్తించి తొలగించాలన్నారు.

March 30, 2026 / 07:13 PM IST

గంజాయి కేసులో నిందితుడిపై పీడీయాక్ట్

BDK: బూర్గంపాడు మండలం, సారపాకకు చెందిన షేక్ మున్వర్‌పై గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పీడీయాక్ట్ నమోదు చేశారు. పలు కేసుల్లో ప్రమేయం ఉండడంతో అతనిపై నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అడ్వైజరీ బోర్డు ఆదేశాల మేరకు ఏడాది పాటు నిర్బంధం విధించారు. మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

March 30, 2026 / 07:12 PM IST