BDK: బూర్గంపాడు మండలం, సారపాకకు చెందిన షేక్ మున్వర్పై గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పీడీయాక్ట్ నమోదు చేశారు. పలు కేసుల్లో ప్రమేయం ఉండడంతో అతనిపై నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అడ్వైజరీ బోర్డు ఆదేశాల మేరకు ఏడాది పాటు నిర్బంధం విధించారు. మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.