SDPT: చేర్యాల పాత బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆకునూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని కీర్తన (17) మృతి చెందింది. ప్రమాదం అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. చేర్యాలలో ఇంటర్ చదువుతున్న కీర్తన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.