PDPL: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని ధర్మారం MEO ప్రభాకర్ సూచించారు. ఇవాళ ఆయన పైడిచింతలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎన్ఆర్ఐ బద్దం సంధ్య సృజన్ రెడ్డి నిర్మించిన డైనింగ్ హాల్‌ను సర్పంచ్ సున్నం రాజయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించుటకు ముందుకు వచ్చిన సృజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.