ఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం కమిషనర్ డీ. గజానంద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరయ్యారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ డేవిడ్, మున్సిపల్ ఛైర్మన్ ఆకాష్, వైస్ ఛైర్మన్ ఎండీ. అహ్మద్ కౌన్సిలర్లు బడ్జెట్ అంశాలపై చర్చించారు.
BHPL: భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా చందుపట్ల కీర్తి రెడ్డిని నియమించినట్లు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తెలిపారు. ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. BJP పార్టీని మరింత బలోపేతానికి కృషి చేస్తామని తెలిపింది. తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా, నాయకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా, మణుగూరులో నాగేశ్వరరావు గడ్డిమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ జూలూరుపాడు మండలం, నర్సాపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని 450 మంది విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించిన ఆయన, వంటగదిలో కుళ్లిన కూరగాయలను చూసి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KMM: ఎస్సీ కార్పొరేషన్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఇడి నవీన్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ 8 లోపు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న దరఖాస్తును ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.
వరంగల్: మహానగర పాలక సంస్థ పరిధిలో ఆస్తి, నల్లా పన్నుల చెల్లింపులకు ఇవాళ తుది గడువు అని కలెక్టర్, GWMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ చాహిత్ బాజ్ పాయ్ తెలిపారు. గ్రేటర్ వరంగల్‌లోని 66 డివిజన్ల ప్రజలు ఆలస్యం చేయకుండా పన్నులు చెల్లించి పెనాల్టీల నుంచి తప్పించుకోవాలని సూచించారు. అర్ధరాత్రి వరకు మీసేవ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు.
PDPL: జిల్లాలో BSNL అండర్ గ్రౌండ్ కేబుల్ పనులను వివిధ శాఖల సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రామగుండం ప్రాంతంలో దెబ్బతిన్న కేబుల్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు. ఆర్ & బీ, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖల అధికారులు పరస్పర సహకారంతో పనిచేయాలని, కేబుల్‌లకు నష్టం కలగకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు.
HYD: మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రజావాణి కార్యక్రమంలో సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుల ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని, బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
MNCL: జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని గర్భిణీలు, బాలింతలు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమా శ్రీ సూచించారు. మంగళవారం జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళల కోసం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, మహిళలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు.
MDK: ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం SIలు ప్రవీణ్ రెడ్డి, శంకర్ అన్నారు. ఇవాళ పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని వాటికి అనుగుణంగా మెలగాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలను కాపాడుకోవాలన్నారు.
NZB: సిరికొండ మండలంలోని హొన్నాజి పేట్ గ్రామంలో మంగళవారం పీఏసీఎస్‌లో మహాజన సభ నిర్వహించారు. సీఈవో గజ్జల నర్సయ్య జమ ఖర్చులు చదివి వినిపించారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తామని పీఏసీఎస్ ఇన్‌ఛార్జి అధికారి దేవకళ అన్నారు. కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతామని అన్నారు.
WNP: ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకుని చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన సమగ్ర విద్యా, విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాని ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు.
KMR: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. బిక్కనూరు మండలం జంగంపల్లిలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ప్రతి మహిళా డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా చేరి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, సర్పంచ్ శ్రీవాణి ఉన్నారు
SRPT: అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో నర్సరీని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ మంగళవారం సందర్శించి పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల సంరక్షణ, నీటిపారుదల సౌకర్యాలు, మొక్కల నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సరీ నిర్వహణ సక్రమంగా కొనసాగుతుందని అభినందించిన స్పెషల్ ఆఫీసర్, అవసరమైన సదుపాయాలను మరింత మెరుగుపరచాలని తెలిపారు.
NZB: మెండోరా మండలం పోచంపాడ్లో ‘ప్రజా పాలన’లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ మాధురి రాజు, డాక్టర్ రాకేష్ శిబిరాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ నిపుణులు కంటి, ఎముకలు, దంత పరీక్షలు చేశారు. గ్రామస్థుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.