• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అసంపూర్తిగా పాఠశాల భవనం.. విద్యార్థుల అవస్థలు

VKB: ధారూర్ మండల పరిధిలోని నాగారంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సరైన వసతులు లేక చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 30, 2026 / 05:07 PM IST

వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు

నల్గొండ జిల్లా రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. సోమవారం మహా పూర్ణాహుతి, వసంతోత్సవం, చక్రస్నానం వంటి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో పులకించిపోయింది.

March 30, 2026 / 05:07 PM IST

ఆసిఫాబాద్‌లో ముగిసిన అశ్విత అథ్లెటిక్స్ పోటీలు

ASF: జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడల పాఠశాలలో నిర్వహించిన ‘అశ్విత అథ్లెటిక్స్’ పోటీల బహుమతి ప్రధానోత్సవానికి జిల్లా కలెక్టర్ కే. హరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెలుపొందిన క్రీడాకారులకు ఆయన బహుమతులు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు.

March 30, 2026 / 05:07 PM IST

గ్రామసభలకు సమగ్ర ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

BHPL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిని ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.

March 30, 2026 / 05:06 PM IST

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

NGKL: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు 10 రోజుల్లో పరిష్కారం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 41 దరఖాస్తులను స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖలకు బదిలీ చేసి తక్షణమే పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

March 30, 2026 / 05:04 PM IST

‘ప్రజావాణి’ ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

BHNG: ‘ప్రజావాణి’లో వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖకు చెందినవి 25, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు 2, హౌసింగ్ శాఖకు 2, మున్సిపాలిటీకి 1 చొప్పున అర్జీలు వచ్చినట్లు తెలిపారు.

March 30, 2026 / 05:03 PM IST

పట్టణ సమస్యల పరిష్కారానికై కలెక్టర్‌కు వినతి

GDWL: అయిజ పట్టణ అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సోమవారం గద్వాల జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ‘మన ఊరు – మన బడి’ కింద నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని, కొత్త బస్టాండ్‌లో సీసీ రోడ్లు, ప్రయాణికులకు వసతులు కల్పించాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

March 30, 2026 / 05:02 PM IST

‘నాలుగు లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే’

NZB: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్​ కోడ్​లను వెంటనే రద్దు చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్​ రూరల్​ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షుడు ముత్తన్న సోమవారం డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని అంగడిబజార్ చౌరస్తాలో లేబర్ కోడ్​ ప్రతులను దహనం చేశారు. ఈ కొత్త కోడ్​ల కారణంగా కార్మికులకు ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు.

March 30, 2026 / 05:02 PM IST

డబ్బాల తొలగింపుపై బాధితుల ఆందోళన

WNP: ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రధాన రహదారిపై ఆక్రమిత డబ్బాలు తొలగించాలనే నిర్ణయంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వారు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి సమస్య వివరించారు. ఏళ్లుగా ఉపాధి పొందుతున్న తమను తొలగిస్తే జీవనం ఎలా సాగుతుందని ప్రశ్నించారు. మంత్రి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

March 30, 2026 / 05:01 PM IST

‘ఇతరుల హక్కులను కాపాడడం మనందరి బాధ్యత’

SRPT: ప్రతి మనిషికి సమాన హక్కులు,స్వేచ్ఛలు కలగాలి అనే గొప్ప లక్ష్యంతో పౌర హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామని తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను గౌరవించడం మాత్రమే కాదు, ఇతరుల హక్కులను కూడా కాపాడడం మనందరి బాధ్యత ఉందని అన్నారు. సమానత్వం, న్యాయం కాపాడాలన్నారు.

March 30, 2026 / 05:01 PM IST

‘ప్రజావాణి’కి అధికారుల డుమ్మా

KMR: ప్రతి సోమవారం మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ‘ప్రజావాణి’ని నిర్వహిస్తుంది. ఈ క్రమంలో మద్నూర్ తహశీల్దార్ కార్యాలయంలో నేడు నిర్వహించిన ప్రజావాణికి అధికారులు డుమ్మా కొట్టారు. కేవలం మూడు శాఖల అధికారులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ప్రజలు తీవ్ర అసహన వ్యక్తం చేశారు.

March 30, 2026 / 05:01 PM IST

ఎండలు ముదురుతున్న వేళ ప్రజలు జాగ్రత్త: కలెక్టర్

GDWL: జిల్లాలో ఎండలు 40 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యత అని కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద తక్షణమే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

March 30, 2026 / 05:01 PM IST

కనకదుర్గ అమ్మవారి దేవాలయ హుండీ లెక్కింపు

NLG: చిట్యాల పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత ఏడాది మార్చి 29 నుంచి ఇప్పటివరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 1,53,510 లు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి తెలిపారు. ఆలయ ఛైర్మన్ మారగోని ఆంజనేయులు సమక్షంలో.. ఎండోమెంట్ అధికారి పూర్ణచందర్రావు పర్యవేక్షణలో లెక్కింపు జరిపారు.

March 30, 2026 / 05:01 PM IST

ఉపాధి కూలీలను నిర్లక్ష్యం చేయవద్దు: కలెక్టర్

GDWL: ఉపాధి హామీ కూలీలు మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు ఎండలో ఉండకూడదని, వైద్యాధికారులు గ్రామస్థాయి వరకు ORS ప్యాకెట్లను పంపిణీ చేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. పొట్ట కూటి కోసం ఉపాధి కార్మికులు పనిచేస్తున్నప్పుడు వారికి రావాల్సిన జీతాన్ని సక్రమంగా అందించాలన్నారు.

March 30, 2026 / 05:01 PM IST

ట్రాఫిక్ నియమాలను పాటించాలి: SP

MDK: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం శివారు ఓ కంపెనీలో ‘Arrive Alive’ కార్యక్రమం నిర్వహించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

March 30, 2026 / 05:01 PM IST