MDK: తూప్రాన్ పట్టణంలో సోమవారం గోపాల కాలువలు కార్యక్రమం చేపట్టారు. పట్టణ శివారులోని పురాతన రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఈనెల 25 నుంచి నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా సోమవారం గోపాల కాలువలు ఉత్సవ నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయం నుంచి స్వామివారిని పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పిల్లలతో వీధుల్లో ఉట్టి కొట్టే కార్యక్రమం చేపట్టారు.
JN: బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు అన్నారు. రఘునాథపల్లిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ సన్నాహక సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి బీజేపీ విధానాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలన్నారు.
PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 8,120 కేసులు పరిష్కరించబడ్డాయని పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ట్రాఫిక్, ఎక్సైజ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కేసులు వేగంగా పరిష్కరించబడ్డాయని పేర్కొన్నారు. ప్రజల సహకారం, పోలీస్ సిబ్బంది సమన్వయంతో ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపారు.
WGL: నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువ పనులను పూర్తి చేసి రైతుల పంటకు నీరు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కాలువలను మాజీ ఎమ్మెల్యే ఇవాళ పరిశీలించారు. తక్షణమే పనులను పూర్తి చేసి రైతులకు నీరు ఇవ్వాలని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలన్నారు.
ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అనుదీప్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భూ ఆక్రమణలు, పిచ్చి కుక్కల బెడద, సీసీ రోడ్లు, డ్రైనేజీ, పెన్షన్ వంటి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
SRD: సదాశివపేట మండలంలోని మద్దికుంట గ్రామంలో గల ఓ ప్రైవేట్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. విద్యుత్ ఘాతానికి గురై ఇసాముద్దీన్ (30) అనే యువకుడి కాళ్లు, చేతులు, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది రఘురామ్, శరీఫ్ వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాధితుడిని చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
HNK: ఏప్రిల్ ఒకటి నుంచి నిర్వహించే ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి పిలుపునిచ్చారు. గుండ్లసింగారం గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి పోరాటాలు చేసేందుకు నిర్వహించబోయే కార్యక్రమానికి ప్రజల మద్దతు ఉండాలన్నారు.
SRCL: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి 205 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ఒక్క ఫిర్యాదును కూడా పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
VKB: పరిశ్రమల పేరుతో మా భూములను లాక్కొని మా జీవితాలను నాశనం చేయవద్దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో పరిగి మండలం రాపోలు గ్రామానికి చెందిన రైతులు పరిశ్రమల పేరుతో భూములను లాక్కోవద్దని ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ.. పరిశ్రమల అభివృద్ధి పేరుతో భూములను లాక్కొని పేదల రైతుల జీవితాలను నాశనం చేయవద్దన్నారు.
RR: షాద్‌నగర్ డివిజన్ కార్యాలయం వద్ద విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టిజన్ కార్మికులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని, విద్యుత్ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టీజన్లకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని కోరారు.
VKB: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లోనే ఉంచకుండా అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 186 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో వస్తారని, వారి వినతులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు.
MNCL: నెన్నెల మండలం గుడిపెల్లి శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెన్నెల నుంచి శ్రీరాంపూర్ వెళ్తున్న బైక్ అదుపుతప్పి కిందపడటంతో అనసూర్య, మల్లీశ్వరి, ఓదెలుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రదీప్, అజయ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను, నీటి కుళాయి బిల్లులను పూర్తిగా చెల్లించిన వినియోగదారులకు ప్రోత్సాహంగా లక్కీ డ్రా పద్ధతిలో బహుమతులు అందజేస్తామని మున్సినల్ కమిషనర్ తిరుపతి సోమవారం తెలిపారు. పన్ను చెల్లింపుల్లో ప్రజలు చురుకుగా పాల్గొనాలన్నారు. సమయానికి బిల్లులు చెల్లించడం ద్వారా నగర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
SDPT: మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చౌటపల్లి మాజీ సర్పంచ్ గద్దల రమేష్ డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో ఆయన్ను ఇవాళ ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి అక్కన్నపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన మాట్లాడుతూ.. అరెస్టులు అప్రజాస్వామికం అని మండిపడ్డారు.
JGL: కొడిమ్యాల మండలంలోని నల్లగొండ లక్ష్మి నరసింహ దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారిగా వీ. అనూష సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అధికారులు, సిబ్బంది నూతన ఈవోకు శుభాకాంక్షలు తెలిపారు.