JN: జనగామ(M) చీటకోడూరు గ్రామంలోని శ్రీ పంచకోసు రామలింగేశ్వర, మల్లిఖార్జున స్వామి దేవస్థానంలో స్వామి వారికి ఇవాళ అన్నపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు కృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. విశేష అలంకరణలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
MLG: మున్సిపల్ కార్మికులకు రూ.22,750 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం కమిషనర్, మేయర్‌కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా రమేష్ మాట్లాడుతూ.. కార్మికుల సంఖ్య పెంచి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. చిన్నచూపు చూస్తే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
MNCL: బెల్లంపల్లిలోని వ్యవసాయ మార్కెట్ PDS గోదాం హమాలీల సమస్యలు పరిష్కరించాలని అధ్యక్షుడు రాజలింగు డిమాండ్ చేశారు. సోమవారం హమాలీల సమస్యలపై విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కూలీరెట్ల పెంపు, పని గంటలు తగ్గించాలని, బరువులు మోసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, భద్రత ఏర్పాట్లు, తాగునీరు, విశ్రాంతి సౌకర్యాల కల్పనలపై సమగ్రంగా చర్చించారు.
WGL: ప్రతి కార్యకర్తకు BRS పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. KCR నాయకత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేశానని, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.
NGKL: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఎస్టీయూ (STU) సభలో ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయ సంఘం నేతలు మండిపడ్డారు. జీవో 25ను సవరించి, నిలిచిపోయిన ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నేత సదానందం గౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పెండింగ్ బెనిఫిట్స్ కోసం ప్రభుత్వం నెలకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉచిత శిక్షణ కోర్సులు ప్రారంభమయ్యాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో రోబోటిక్ వెల్డింగ్, ఎలక్ట్రిక్ వెహికిల్, CNC మిషిన్, CAD డిజైనింగ్ వంటి కోర్సులు అందిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ADB: ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రతి సోమవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదులను కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారుల దయచేసి తమ సమస్యలను జిల్లా ఎస్పీకి స్వయంగా తెలియజేశారు. సమస్యలను విన్న జిల్లా SP నేరుగా సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
KNR: జమ్మికుంటలో నిర్వహించిన రైల్వే SCRMU బ్రాంచ్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. నెల రోజుల్లో రెస్ట్ షెల్టర్ రూమ్ నిర్మిస్తామని, సీనియారిటీ ప్రకారం బదిలీలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే గేట్ (LC-24) వద్ద నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలను రైల్వే కార్మికులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
NZB: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. వినయ్ కుమార్ రెడ్డితో పాటు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.
NGKL: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళవారం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో జరిగే జనరల్ బాడీ సమావేశానికి హాజరవుతారని మున్సిపల్ ఛైర్మన్ రత్నమాల తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పెరుగుతున్న ఎండల దృష్ట్యా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభిస్తారన్నారు.
SRPT: ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్ డిపో వద్ద బస్సు డ్రైవర్లకు డీఎస్పీ ప్రసన్నకుమార్ వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాల్సిన బాధ్యత ఆర్టీసీ డ్రైవర్లపై ఉన్నదని డీఎస్పీ తెలిపారు. నిబంధన ప్రకారం వాహనాలను నడపాలని అతివేగంగా వెళ్లకుండా నిదానంగా వెళ్లాలని సూచించారు.
KMR: బాన్సువాడ విద్యుత్ డివిజనల్ కార్యాలయం ఎదుట సోమవారం ఆర్టీసన్, అన్మనెడ్, పీస్ రేట్ కార్మికులు కుటుంబ సభ్యులతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించడంతో పాటు పీస్ రేటును తీసివేసి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
GDWL: పెరుగుతున్న ఎండల దృష్ట్యా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పని వేళలను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటలకే పరిమితం చేయాలని ఐఎఫ్టీయూ (IFTU) జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ డిమాండ్ చేశారు. సోమవారం కార్మికులతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో సుమారు 1200 మంది కార్మికులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారన్నారు.
SDPT: హుస్నాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం బస్టాండ్ కంట్రోలర్ లకావత్ హరికి వినతి పత్రం సమర్పించారు. బస్టాండ్‌లో ఇటీవలి కాలంలో దొంగతనాలు తరచూ జరుగుతున్నాయన్నారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు.
BHNG: భువనగిరి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌సేటీ) శిక్షణా కేంద్రాన్ని సోమవారం కిసాన్ నగర్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ యువత, మహిళలు శిక్షణా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.