తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించిన గ్రూప్ -1 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ (Question paper leak) కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సంచలన కామెంట్స్ చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత, (MLC KAVITHA) మంత్రి హరీశ్ రావు హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన వ్యక్తులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చెందిన కాన్ఫిడెన్సియల్ సెక్షన్ లో ఉన్నారని… వీరు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లను కవితకు అందజేశారని ఆయన అన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించిన గ్రూప్ -1 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ (Question paper leak) కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సంచలన కామెంట్స్ చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత, (MLC KAVITHA) మంత్రి హరీశ్ రావు హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన వ్యక్తులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చెందిన కాన్ఫిడెన్సియల్ సెక్షన్ లో ఉన్నారని… వీరు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లను కవితకు అందజేశారని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని… సరైన సమయంలో వాటిని హైకోర్టుకు (High Court) కానీ, సీబీఐకి (CBI) కానీ అప్పగిస్తానని RSP చెప్పారు
టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ బి. జనార్ధన్ రెడ్డి(Janardhan Reddy) తక్షణమే పదవికి రాజీనామా చేయాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన సిట్ పై తనకు నమ్మకం లేదని చెప్పారు. సిట్ నుంచి డీజీపీ, చీఫ్ సెక్రటరీకి అందే నివేదికలు చివరకు ముఖ్యమంత్రి చేతికి చేరుతాయని…. బాధితులకు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఏమాత్రం లేదని అన్నారు. ఈ అంశంలో రాష్ట్ర గవర్నర్ (State Governor) జోక్యం చేసుకోవాలని… తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి ఆర్టికల్ 317 కింద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని డిస్మిస్(Dismiss) చేయాలని ఆయన కోరారు.