MDK: తూప్రాన్‌లో ఐస్ క్రీమ్ పార్లర్ యజమాని మహావీర్ పై కేసు నమోదు చేసినట్లు తూప్రాన్ ఎస్సై గంగరాజు తెలిపారు. కాలం చెల్లిన ఐస్ క్రీమ్‌లు విక్రయిస్తున్నట్లు గుర్తించి వినియోగదారులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇవాళ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి జ్ఞానేశ్వర్‌తో కలిసి దాడులు చేసి, కాలం చెల్లిన ఐస్ క్రీమ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.