MDCL: ఇన్స్టాగ్రామ్లో స్టార్ క్యాంపెనింగ్ పేరుతో జరుగుతున్న మోసాల పై HYD పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఆకర్షణీయ ఆఫర్లు, ఫాలోవర్స్ పెంచుతామన్న హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఊరికే నమ్మి డబ్బులు చెల్లించొద్దని సూచించారు. ఇలాంటి వ్యవహారాల్లో డబ్బు, సమయం వృథా అవుతాయని చెప్పారు. పలు కేసుల్లో డూప్లికేట్ వస్తువులు విక్రయిస్తున్నట్లు బయటపడింది.