SRCL: రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన నర్రా లక్ష్మి (బోయ) ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి నూతన వస్త్రాలు అందజేసి మాట్లాడారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ప్రభుత్వ విప్ అన్నారు.