PDPL: గత నెల రోజుల నుంచి నిర్వహించబడుతున్న పదవ తరగతి పరీక్షలు ఈరోజుతో ముగిశాయి. ధర్మారం మండలంలో ఇవాళ సాంఘిక శాస్త్రం పరీక్షతో పదవ తరగతి ప్రధాన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ తెలిపారు. 15, 16 తేదీలలో మోడల్ స్కూల్, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు ఒకేషనల్ పరీక్షలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు.