ఖర్చు నియంత్రణ కోసం కొందరు క్రెడిట్ కార్డులను క్లోజ్ చేస్తుంటారు. కానీ ఇలా చేస్తే క్రెడిట్ స్కోర్ పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అత్యవసరంలో సాయపడే ఈ కార్డులను యాక్టివ్గానే ఉంచుకోవడం ఉత్తమమని.. ఖర్చు నియంత్రణకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కావాలంటే ఫస్ట్ తీసుకున్న కార్డును కాకుండా తర్వాత తీసుకున్నవి క్లోజ్ చేయొచ్చంటున్నారు.