HNK: విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని హనుమకొండ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (MPC) ఫలితాల్లో 997 మార్కులు సాధించిన తీగల సాయి శ్రేష్ఠితను రావు పద్మ ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో కష్టపడి చదివి మరిన్ని విజయాలు సాధించి హనుమకొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సాయి శ్రేష్ఠితకు రావు పద్మ సూచించారు.