NGKL: చారకొండ గ్రామంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చౌరస్తాలో పాపన్న గౌడ్, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు చింతపల్లి శంకరయ్య గౌడ్ తన వంతు సహాయంగా రూ. 20,116 విరాళాన్ని అందజేశారు. గౌడ సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.