KMM: నేలకొండపల్లి లోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం పూర్వ పూజారి ముడుంబా కృష్ణమాచార్యులు ఇవాళ మధ్యాహ్నం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు శ్రీలత పసుపులేటి వారి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.