MDCL: మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మల్కాజ్గిరి, యాప్రాల్, సైనిక్ పూరి ప్రాంతాల్లో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల ఆక్రమణలను ఎక్కడికక్కడ తొలగించాలని సూచించారు. వాయు పూరి వెస్ట్ పార్కులో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, నిర్మాణపు వ్యర్ధాలను రోడ్లపై ఉండకుండా చూడాలని, తొలగింపుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.