JGL: కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో గురువారం ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య, ఉచితంగా మధ్యాహ్న భోజనం యూనిఫామ్స్ అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలన్నారు.