GDWL: అలంపూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్లు సోమవారం ఎస్సై రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడమని సూచించారు. పట్టణ ప్రధాన కూడళ్లలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని ఎస్సైకి విజ్ఞప్తి చేశారు.