VKB: కుల్కచర్ల మండల కేంద్రంలో మహనీయుల జయంతి వేడుకల నేపథ్యంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసినట్లు పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్ తెలిపారు. తెలంగాణ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుకు ఇరువైపులా సిబ్బందితో శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బందితో పాటు దళిత, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.