JGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెట్పల్లి డివిజన్ ఆర్డీవోగా నూతన బాధ్యతలు స్వీకరించిన జి. నరసింహరావు సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం అందజేయగా, కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.