MBNR: పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్–I వాలంటీర్లు లక్ష్మీపల్లి గ్రామంలో నిర్వహించే 7 రోజుల ప్రత్యేక శిబిరానికి బయలుదేరారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య జీఎన్ శ్రీనివాస్ విద్యార్థులు సేవాభావంతో గ్రామ సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రో. రమేష్ బాబు, ప్రోగ్రాం అధికారి డా రవికుమార్, వాలంటీర్స్ పాల్గొన్నారు.